ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో భారీగా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు, వెంటనే అప్లై చేయండి! https://ippbonline.bank.in/
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి చెందిన టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచ్లలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి కఠినమైన రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- అర్హత: ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ సేల్స్ లేదా బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
- వయోపరిమితి: 21 ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు.
- ఎంపిక విధానం: అభ్యర్థులు డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా స్క్రీనింగ్ చేసి, ఆపై నేరుగా గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000 స్థిర వేతనంతో పాటు లొకేషన్ అలవెన్సులు మరియు పర్ఫార్మెన్స్ ఆధారిత ఇన్సెంటివ్స్ లభిస్తాయి.
- JOB APPLIED LINK: https://ippbonline.bank.in/web/ippb/current-openings
