బ్యాంక్ ఉద్యోగాల వేటలో ఉన్నారా? 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) పోస్టుల భర్తీకి ఐబిపిఎస్ నోటిఫికేషన్! https://www.ibps.in/
ముంబై: దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్ కేడర్ ఉద్యోగాల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) వార్షిక పీఓ (PO) నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా 11 ప్రభుత్వ బ్యాంకుల్లో మొత్తం 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్స్/మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాంకుల్లో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఇది ఒక గొప్ప అవకాశం.
- అర్హత: కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిసిప్లిన్ లో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
- వయస్సు: కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి, గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
- ఎంపిక పద్ధతి: మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొదటి దశలో ఐబిపిఎస్ ప్రిలిమినరీ పరీక్ష, అందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్ష, చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది.
- పరీక్షా కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- POST APPLIED LINK: https://www.ibps.in/
- NOTIFICATION AND SYLLABUS LINK: https://www.ibps.in/wp-content/uploads/Detailed-Notification_CRP-PO-XVI_Final_V1_30.06.2026.pdf
