ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. నెలకు రూ. 40,000 ప్రారంభ వేతనం, పూర్తి వివరాలు! https://www.aai.aero/
న్యూఢిల్లీ: మినిరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విమానాశ్రయాలలో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్-ATC) పోస్టుల భర్తీ కోసం అఫీషియల్ కెరీర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విమానయాన రంగంలో సెటిల్ అవ్వాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన కెరీర్ ఆప్షన్.
- అర్హత: ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులుగా రెగ్యులర్ త్రీ ఇయర్స్ బిఎస్సీ (B.Sc) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా ఏదైనా ఇంజనీరింగ్ (B.E / B.Tech) లో ఫిజిక్స్, మ్యాథ్స్ ఒక సెమిస్టర్ లో చదివి ఉండాలి. అభ్యర్థులకు ఇంగ్లీష్ మాట్లాడటం మరియు రాయడం పక్కాగా వచ్చి ఉండాలి.
- వయస్సు: గరిష్ట వయోపరిమితి 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు వయోసడలింపు వర్తిస్తుంది.
- వేతనం: ఈ పోస్టులకు పే-స్కేల్ రూ. 40,000 నుండి రూ. 1,40,000 వరకు ఉంటుంది. అన్ని అలవెన్సులు కలుపుకుని సంవత్సరానికి దాదాపు రూ. 12 లక్షల (CTC) ప్యాకేజీ లభిస్తుంది.
- ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), అప్లికేషన్ వెరిఫికేషన్ మరియు వాయిస్ టెస్ట్ (కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేయడానికి) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
- JOB APPLIED LINK: https://www.aai.aero/en/careers/recruitment
